25 February, 2026 | 12:23 PM

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

25-02-2026 10:31 AM

కేంద్రాలకు తరలిన విద్యార్థులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు(Inter exams started) బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 48 ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో ఉండగా 10301 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 19 కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు పరీక్షల నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా విద్యార్థులు పరీక్ష కేంద్రాల  వద్దకు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. మొదటి రోజు పరీక్షలు రాసి ఇంటికి వెళుతున్న విద్యార్థులకు స్నేహితులు ,కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.