13 April, 2026 | 4:18 PM

Breaking News

ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •  

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

25-02-2026 10:33 AM

మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్...వైస్  చైర్మన్ మల్లికార్జున రావు

హుజూర్ నగర్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మున్సిపల్  చైర్మన్ దొంతగాని శ్రీనివాసు,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ అన్నారు. మంగళవారం పట్టణంలోని గోవిందపురం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో  మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోల ఉదయభాను ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వార్డులలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ప్రగతి సాధిస్తామని తెలిపారు.వీధి దీపాల ఏర్పాటు డ్రైనేజీల నిర్మాణం సిసి రోడ్ల ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్య నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసు, కౌన్సిలర్లు ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.