మంత్రి రాజ్‌నాథ్‌తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్ ఏరియాలోని రక్షణ శాఖ భూముల కేటాయింపు, హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను అప్పగించాలని కోరారు. వరంగల్ లో సైనిక్ స్కూట్ ఏర్పాటులతో పాటు మరిన్ని అభివృద్ధి అంశాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సీఎం విజ్ఞాప్తి చేసినట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. కాగా, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమవేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘు వీర్ రెడ్డి, రామ సహాయం సురేష్ షెట్యార్ ఇతర నేతలు పాల్గొన్నారు.






