30 July, 2026 | 3:49 AM

లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా

24-06-2024 07:41 PM

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా సోమవారం రాజీనామా చేశారు. 17వ లోక్ సభకు స్వీకార్ గా వ్యవహరించిన ఓం బిర్లా ఇవాళ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన రాజీనామా చేశారు. ఓం బిర్లా రాజీనామా అనంతరం స్పీకర్ కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు లోక్ సభ సచివాలయం తెలిపింది.

జూన్ 26వ తేదీన జరుగనున్న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. రేపటితో స్పీకర్ పదవి నామినేషన్ల తుది గడువు ముగియనుంది. ఇవాళ ప్రారంభమైన తొలి లోక్ సభ సమావేశంలో భాగంగా పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రాసంగించనున్నారు.