సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ : మంత్రి తుమ్మల
24-06-2024 06:27 PM
హైదరాబాద్ : సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో మదిరిగా ప్రభుత్వ పథకాలు పక్కదోవ పట్టావని మంత్రి తుమ్మల ఎద్దెవా చేశారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. రైతుల పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండూ మా ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని మంత్రి పేర్కొన్నారు.






