5 May, 2026 | 12:35 PM

వైఎస్ఆర్ వర్ధంతి.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

02-09-2024 01:51 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, పలువులు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఉన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు.