ప్రజల గుండెల్లో పవర్.. పవన్ కు 'చిరు' విషెస్..
హైదరాబాద్: ప్రజలకు ఈ రోజులలో పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు కావాలని చిరంజీవి అన్నారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మెగా అభిమానులకు ఆయన ఓ ప్రత్యేక ఫోటో షేర్ చేశారు. "కల్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్, తన భార్య సురేఖలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.






