4 April, 2026 | 11:02 PM

ఆరోగ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి

02-12-2024 04:38 PM

హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్స్ లకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.