పరీక్షలు వాయిదా వేస్తూ పోతే.. మీ యుక్తవయస్సు వృథా అవుతుంది
హైదరాబాద్,(విజయక్రాంతి): ): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లోని సోమవారం నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 108 కోసం 136, 102 కోసం 77 అంబులెన్స్ లకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాదిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య శాఖలో నియామించడం ఒక చరిత్ర అన్నారు. గత పదేళ్ల పాలనను మీరు ప్రత్యేక్షంగా చూశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 వైద్య కళాశాలు ఇచ్చి ఎలాంటి వసతులు కల్పించలేదని వివర్శించారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, వైద్యం అని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రబుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పుడు మరో 6500 మందిని వైద్యారోగ్య శాఖలో నియమించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు కల్పించలేదు, ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా పేపర్ లీక్ ను అరికట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యువత నమ్ముతోంది. పరీక్షులు వాయిదా వేస్తూ పోతే మీ విలువైన యుక్తవయస్సు వృథా అవుతుందని, మన భవిష్యత్తు 21 నుంచి 35 ఏళ్లలోపు మీరు చేసే పనులే నిర్ణయిస్తాయని సీఎం సూచించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామని, ఇది రాష్ట్రంలోని యువతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని కొనియడారు.పరీక్షలు వాయిదా వేస్తే యువత కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా మారి, ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అదే పరీక్షులు నిర్వహిస్తే ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగం రానివారు మరో ఉద్యోగమో, వ్యాపారమో చూసుకుంటారని పేర్కొన్నారు.
త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు ఇచ్చి 563 గ్రూప్-1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం చేయబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ ఉద్యోగాలు సక్రమంగా నిర్వహించాలనే ఒక ఐఏఎస్ ను ఛైర్మన్ గా నియమించామన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ను, తహసీల్దార్ ను గతంలో టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించారని, పునరావాస కేంద్రాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మార్చారని ఆరోపించారు. చిన్న ఉద్యోగి పెద్దపెద్ద ఉద్యోగస్థులను నియమించలేరుగా..?, పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాల గురించి పూర్తి అవగాహన ఉన్న అధికారులే సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాకో మెడికల్ కళాశాల, నియోజకవర్గానికొక 100 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదని విమర్శించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ఇప్పుడు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఏడాదిలో రూ.835 కోట్లను ఖర్చుల చేస్తుందన్నారు.




