ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీ
ఏపీలో తొలిసారిగా
తెలంగాణ, ఏపీ సీఎస్ ల నేతృత్వంలో అధికారులు భేటీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సోమవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారిగా సమావేశమయ్యారు. తెలంగాణ, ఏపీ సీఎస్ ల నేతృత్వంలో అధికారులు భేటీ కొనసాగుతోంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్ను పెంపకంపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై చర్చించే అవకాశం, విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9,10 సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిన రూ. 8వేల కోట్ల అంశంపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి సీఎస్, ఆర్థిక, హోంశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శలులు, ఏపీ సీఎస్, ఆర్ధికశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్ కో సీఎండీ హాజరయ్యారు.




