30 June, 2026 | 4:05 PM

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

30-06-2026 03:26 PM

యాదాద్రి: తెలంగాణ తిరుపతిగా(Telangana Tirupati) పిలవబడే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ(Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple) అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు మార్కెట్ రేటు ప్రకారం భూమి కేటాయించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మఠాలు కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. అలాగే కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. భూముల యాజమాన్య హక్కులు(Land ownership rights) ఆలయం వద్దనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూముల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం మోడల్‌ను అధ్యయనం చేసి అనుసరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

యాదగిరిగుట్టపై(Yadagirigutta) గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చిన వాళ్ల జాబితాను సిద్ధం చేయాలని, విడతల వారీగా గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. గెస్ట్‌హౌస్‌ల నిర్మాణంలో కూడా తిరుమల మోడల్‌ను అమలు చేయాలని వెల్లడించారు. భూసేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని, యాదాద్రి ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి వారం రోజుల్లో తుది నివేదిక అందించాలని ఆదేశించారు. అట్లనే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.