లైబ్రేరియన్ రాజారాంకు సన్మానం
నిర్మల్,(విజయక్రాంతి): మామడ మండల కేంద్రంలో లైబ్రేరియన్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన పగడం రాజారాంను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజారాం తన సేవా కాలంలో గ్రంథాలయ అభివృద్ధికి విశేష కృషి చేసి, విద్యార్థులు, యువతలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఆయన సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొని యువతకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొని రాజారాంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






