30 March, 2026 | 8:03 PM

ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్

17-02-2025 03:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణా(Sand Transportation)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఉక్కుపాదం మోపింది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశించారు. ఇక మీదట ఎవరైనా ఇసుక రీచ్(Sand Reach)లను తనిఖీలను చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.