2017లో బ్రిటీష్ యువతిపై హత్యచారం... యువకుడికి జీవిత ఖైదు
పనాజీ,(విజయక్రాంతి): 2017లో బ్రిటిష్ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో గోవా కోర్టు సోమవారం వికాట్ భగత్ (31)కు జీవిత ఖైదు విధించింది. గత 8 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత, మార్గోవా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 28 ఏళ్ల బ్రిటిష్ పర్యాటకురాలిపై జరిగిన అత్యాచారం-హత్య కేసులో భగత్ ను దోషిగా నిర్ధారించింది. అతనిపై హత్య, అత్యాచారం, దోపిడీ, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయి. భగత్ కు కఠినంగా జీవిత ఖైదు అమలు చేయాలని గోవా కోర్టు పేర్కొంది. మార్చి 14, 2017న దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో ఆమెతో ఒక సాయంత్రం గడిపిన నిందితుడు తర్వాత యువతిని భగత్ తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. అటవీ ప్రాంతంలో 28 ఏళ్ల పర్యాటకురాలి మృతదేహన్ని పరేశాడు. బాధితురాలి తలకు తీవ్ర గాయాలతో ఆమె మరణించింది.
యువతి ముఖం, తలపై గాయాలు ఉన్నట్లు శవపరీక్ష నివేదికలో వెలువడింది. నేరస్థలంలో భగత్‌కు సంబంధించిన కీలకమైన ఆధారాలను లభించాయిని బాధితురాలి తల్లి ఆండ్రియా బ్రానిగన్ తరపున న్యాయవాది విక్రమ్ వర్మ తెలిపారు. నిందితుడి తొడ, గజ్జలపై గాయాల గుర్తులు, అతడి చొక్కా, ద్విచక్ర వాహనంపై బాధితురాలి రక్తం ఉన్నట్లు వివరించారు. నిందితుడి కాంకోనా సమీపంలో రక్తపు మరకలున్న దుస్తులతో కూడిన బ్యాక్‌ప్యాక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ప్రాసిక్యూషన్ కేసును మరింత బలోపేతం చేసింది. ఇవాళ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి క్షమా జోషి భగత్ కు కఠిన జీవిత ఖైదు విధిస్తూ, అత్యాచారం చేసి హత్య చేసినందుకు రూ. 25,000 మరియు సాక్ష్యాలను నాశనం చేసినందుకు రూ. 10,000 జరిమానా విధించారు. సాక్ష్యాలను నాశనం చేసినందుకు దోషికి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని న్యాయవాది విక్రమ్ వర్మ వాదించారు.




