29 March, 2026 | 2:09 PM

కాళేశ్వరం విచారణకు ఆదేశాలు తెండి.. అప్పుడే వింటాం

29-03-2026 12:31 PM

హైదరాబాద్: శాసనసభలో సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది. దానిపై విచారణ జరిగిపించాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ వచ్చిన పదేపదే ప్రస్తావించారు. మీరు కేసీఆర్ ను జైలులో పెట్టాలేరని, మీవాళ్ల కాదని,  ఈ కేసును సీబీఐకి బదిలి చేయండి, 48 గంటలో కేసీఆర్, హరీష్ రావును ఆయన కుటంబాన్ని జైలులో పెడతామని  కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి స్వయంగా చెప్పరాని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

వీరి నమ్మి శాసనసభలో పూర్తిస్థాయిలో చర్యలు జరిగిన తరువాత కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని చెప్పారు. కేసును అప్పగించి నెలలు గడుస్తున్న ఇంకా చర్యలు లేవని, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కాళేశ్వరం కుంభకోణంపై విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కేసీఆర్, హరీష్ రావును జైల్లో పట్టిన తరువాత మీరు వచ్చి సుచనలు చేస్తే మేం వింటామని బీజేపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తెలిపారు.