30 July, 2026 | 10:59 AM

వేములవాడకు చేరుకున్న మంత్రులు తుమ్మల, అడ్లూరి

30-07-2026 10:28 AM

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ

వేములవాడ, జులై 30(విజయక్రాంతి): జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ కు చేరుకున్న మంత్రులు జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు  ప్రత్యేక పూజలు చేశారు. వరుణ యాగంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు.