30 July, 2026 | 10:56 AM

ఎల్లంపల్లికి పెరిగిన వరద

30-07-2026 10:21 AM

హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు(Sripada Yellampalli Project) వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు ప్రాజెక్టులోకి 48,0013 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. క్యాచ్ మెంట్ ప్రాంతం నుంచి ఈ వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టిఎంసిలు కాగా ప్రస్తుతం 13.265 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 145.28 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 12,875 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నంది పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాల (హెచ్ఎండబ్ల్యూఎస్) కోసం 275 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు ఏమి తెరవలేదు.