30 July, 2026 | 11:09 AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 10:38 AM

మునిపల్లి ఎస్ ఐ ఏ అరవింద్ కుమార్...

మునిపల్లి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో భారీ  వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని మునిపల్లి ఎస్ ఐ అరవింద్ కుమార్  కోరారు. భారీ వర్షాలు కురుస్తుందున వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు.  అలాగే విద్యుత్ పరికరాలకు, పోల్స్ కు దూరంగా ఉండాలనీ, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా Dail 100కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని సూచించారు.