హెచ్ఐసీసీలో షీల్డ్-2025 సదస్సు.. ప్రారంభించనున్న సీఎం
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): హెచ్ఐసీసీలో మంగళవారం, బుధవారం షీల్డ్-2025 సదస్సు జరగనుంది. షీల్డ్-2025 సదస్సు(SHIELD-2025 Conference)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో సైబర్ సెక్యూరిటీ నిపుణులు పాల్గొన్నారు. సైబర్ నేరాలకు(Cyber Crimes) పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. షీల్డ్-2025 సదస్సు ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగినందున అవగాహన అవసరామని సైబర్ సెక్యూరిటీ వింగ్(Cyber Security Wing) చెప్పింది. గతేడాది దేశవ్యాప్తంగా రూ.22,812 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగాయి. రాష్ట్రంలో లక్ష 20 వేల 869 సైబర్ క్రైమ్ నేరాలు నమోదు కాగా, పలు కేసుల్లో సొమ్ము రికవరీ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. 17,912 మంది బాధితులకు రూ.183 కోట్లు చెల్లించామన్నారు. సైబర్ నేరాల నివారణకే టీజీసీఎస్ బీ - షీల్డ్ ని ప్రవేశపెట్టిందని, షీల్డ్-2025ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పష్టం చేసింది.




