కరాటే పోటీల్లో ఎండీహెచ్ డబ్ల్యూఎస్ ఆశ్రమ పిల్లల ప్రతిభ
అభినందించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): గోదావరిఖని గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్(MDHWS) బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో అత్యంత ప్రతిభ చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 16వ తేదీన స్పార్క్ కుంగ్ - ఫూ అకాడమీ ఆఫ్ ఇండియా(Spark Kung - Fu Academy of India) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్-2025 పోటీలలో(Karate Championship-2025 Competitions) పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. కాగా, ఈ పోటీలలో జి రామ్(గోల్డ్ మెడల్), జి లక్ష్మణ్(గోల్డ్ మెడల్), ఎం శ్యాంప్రసాద్(గోల్డ్ మెడల్), ఏ జగదీష్(గోల్డ్ మెడల్), సంజీవ్ కుమార్(సిల్వర్ మెడల్), రక్షిత్ (సిల్వర్ మెడల్) సాధించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పిల్లలను అభినందిస్తూ మెడల్స్ తో సత్కరించారు.
చిన్నతనంలోనే నా అనే వారిని కోల్పోయి విధి వంచితులైన అనాధ పిల్లలను చేరదీసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమ పిల్లల కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడింగ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాశ్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలేటి మారతి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఆయిల్ ప్రసాద్, మంథని మున్సిపాలిటీ చైర్మన్ రమాదేవి, శశి, భూషణ్, కాషా, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ఆశ్రమ వ్యవస్థాపకులు, పెద్దపెల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, పోచంపల్లి రాజయ్య ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.




