30 July, 2026 | 4:48 PM

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం ఆసక్తికర ట్వీట్‌

30-11-2024 11:51 AM

హైదరాబాద్: ఏడాది క్రితం ఇదే రోజు మార్పు కోసం రైతు బోటు వేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది క్రితం వేసిన ఓటు అభయహస్తమై.. రైతన్న చరిత్రను తిరగరాసిందని సీఎం వెల్లడించారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాల్ కు రూ. 500 బోనస్, రూ. 40,444 కోట్ల ఉచిత విద్యుత్, రూ. 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. ఒక్క ఏడాదిలో రూ. 54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది నెంబర్ కాదు, రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని తెలిపారు. ఈ సంతోషసమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.