అదుపు తప్పిన కారు.. నలుగురు స్పాట్ డెడ్
30-11-2024 11:25 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురం పోలిపల్లి జాతీయ రహదారి-16 పై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి బోల్తా పడింది. కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






