సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత
బోథ్(విజయక్రాంతి): గ్రామంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల కోసం గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని ధన్నూర్ గ్రామంలో దాదాపు 25 వేల రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు అన్ని వార్డుల లోని ప్రధాన కూడలిల లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో గ్రామం సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉంది. గ్రామం చుట్టూ అనేక గ్రామాలు ఉండడంతో గ్రామానికి ఎవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారు అనేది తెలియకపోవడంతో గ్రామస్తులు ముందు చూపుతో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
పోలీసుల సూచనతో
దొంగతనాలు జరగకుండా గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రామ సర్పంచ్ హేల్మ రోహిణి పేర్కొన్నారు పోలీసు అధికారుల సూచన మేరకు ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. సీసీ కెమెరాలు వల్ల గ్రామం నిఘా నీడలో ఉందన్నారు
గ్రామాభివృద్ధి కమిటీ సహకారం ఎంతో ఉంది
గ్రామాభివృద్ధి సహకారం ఎంతో ఉందని గతంలో ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీ వారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే నిఘా నీడలో ఉంచారన్నారు వారు సీసీ కెమెరాలు గతంలోను ఏర్పాటు చేయించారన్నారు. అయితే కొంతకాలంగా గ్రామ అభివృద్ధి కమిటీ రద్దు కావడంతో గ్రామంలోని సామాజిక బాధ్యతలను గ్రామపంచాయతీ వారు నిర్వహించుకుంటున్నారన్నారు ఏది ఏమైనా సీసీ కెమెరాలు ఏర్పాటుతో గ్రామంలో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోయింది.






