28 June, 2026 | 12:55 PM

పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష

28-06-2026 12:16 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి సోనాల గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ పేర్కొన్నారు. సోనాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. కాగా మండలంలోని పార్టీ గ్రామ సర్పంచ్ వినోద్ పాట్నాపూర్ గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ కరత్వా డ సర్పంచ్ విశ్వేశ్వర్ తో పాటు బోథ్ మండలం గ్రామాల్లో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు .కార్యక్రమాన్ని డాక్టర్ నవీన్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది.