15 July, 2026 | 1:44 AM

రేపు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

25-10-2024 06:30 PM

కొడంగల్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సీఎం వ్యక్తిగత సహాయకులు  ఓ ప్రకటనలో తెలిపారు. రేపు శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకు కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్బంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ మండలంలో ఇటీవలే మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాజ్ కుమారుడు కీ:శే సతీష్ కుటుంబానికి పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం బొంరాస్పెట్ మండలం రేగడిమైలారంలో ఇటీవలే మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీ:శే నర్సిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు.