31 July, 2026 | 1:15 PM

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

23-06-2024 04:04 PM

హైదరాబాద్ : రేపటి నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ పయనం కానున్నారు. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు రేపు లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు, మంత్రవర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.