31 July, 2026 | 2:22 PM

రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

23-06-2024 03:51 PM

రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. అంతకుముందు జడ్జి కి ఆలయాచకులు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు .అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రేమలత, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి సుజన, ఆర్డిఓ రాజేశ్వర్, డి.ఎస్.పి నాగేంద్ర చారి, ఆలయ ఈవో రామకృష్ణ, ఏఈఓ బీ శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.