29 August, 2026 | 9:43 PM

కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

10-06-2024 12:06 PM

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్,  భూపతిరాజు శ్రీనివాస వర్మలకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని సీఎం కోరారు. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, 30 మందికి కేబినెట్ హోదా, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది రాష్ట్రాల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.