29 August, 2026 | 8:38 PM

Breaking News

సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర   •  

బాధ్యతలు చేపట్టిన ప్రధాని.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం

10-06-2024 12:29 PM

న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి కిసాన్ నిధి 17వ విడత విడుదల ఫైల్ పై సోమవారం నాడు మోడీ తొలి సంతకం చేశారు. ఈ పథకం ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, దాదాపు ₹20,000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రధాని తెలిపారు. సౌత్ బ్లాక్ లోని పీఎంవో నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టారు.

‘‘కిసాన్ కల్యాణ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.