29 August, 2026 | 10:42 PM

ప్రధాని నివాసంలో కేబినెట్ భేటీ

10-06-2024 11:28 AM

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వం తొలి క్యాబినెట్ భేటీ కానుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత ఈ భేటీ జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీతో ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనతాదళ్ (యునైటెడ్) (జెడియు) ఇతర మిత్రపక్షాలతో సహా ఎన్‌డిఎలోని పలువురు ఎంపీలు కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నేడు అమిత్ షాను కవలనున్నారు. ఈటలను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు జోరు ప్రచారం సాగుతోంది..