హెల్త్ స్కీంపై నేడు సీఎం సమీక్ష
01-06-2026 12:34 AM
- ఉద్యోగుల హెల్త్‌కేర్ ట్రస్ట్ కమిటీని ప్రకటించే అవకాశం
- డిజిటల్ హెల్త్ కార్డుల జారీ
- వివరాలు అప్‌లోడ్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ అమలుపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని సీఈవోగా నియమిస్తారు. కమిటీని నేడు ప్రకటించే అవకాశముంది. మరోవైపు డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగు లు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను మే 31లోపే అప్‌లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ డేటా ఆధారంగా హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ వైద్య సేవలందనున్నాయి.






