నేటి నుంచి తెరుచుకోనున్న జూనియర్ కాలేజీలు
01-06-2026 12:36 AM
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. సోమవారం నుం చి ఇంటర్ విద్యార్థులకు తరగతులు మొదలవుతాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉండటంతో సెలవులను ఇంకా పొడిగించాలని అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ సీఎంకు విజ్ఞపి చేస్తూ లేఖ రాసింది. జూన్ 8 వరకు సెలవులివ్వాలని కోరినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.జంగయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.






