29 May, 2026 | 2:28 AM

సీఎం సిద్ధరామయ్య రాజీనామా

29-05-2026 01:56 AM
  1. కర్ణాటక తదుపరి సీఎం.. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమారేనని వెల్లడి
  2. హైకమాండ్ ఆదేశాల మేరకే తప్పుకుంటున్న..
  3. నాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు
  4. ఎమ్మెల్యేగానే సేవచేస్తా
  5. తన రాజీనామా లేఖను లోక్‌భవన్‌లో అందజేసిన సిద్ధు
  6. సిద్ధును హత్తుకుని, పాదాభివదనం చేసిన డీకే
  7. నేడు సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక!

బెంగళూరు, మే 28: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. హైక మాండ్ ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి పద వి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించా రు. అధిష్ఠానం ఆదేశాలే తనకు శిరోధార్యమంటూనే.. ‘నాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, ఇక ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తా’ అని కాంగ్రెస్ హైకమాండ్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. తన రాజకీయ వారసుడు డీకే శివకుమారేనని సిద్ధరామ య్య ప్రకటించారు.

గురువారం ఉదయం మంత్రులతో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో భావోద్వేగానికి గురికాగా.. ఆయనను డిప్యూటీ సీఎం డీకే శివకు మార్ ఆలింగనం చేసుకుని, ఆయన పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నా రు. అక్కడి నుంచి నేరుగా డీకే శివకుమార్‌తో కలిసి సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్ల గా, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి తన రాజీనామా లేఖను సమర్పించారు.

దీంతో కర్ణాటకలో మూడేళ్ల సిద్ధరామయ్య ప్రభుత్వానికి తెరపడగా.. కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. శుక్రవారం జరగనున్న సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతగా డీకేను ఎన్నుకోనున్నారు. మరోపక్క సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగాలని, ఆయనను మార్చవద్దంటూ కాంగ్రెస్ అధిష్ఠానా నికి వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారు లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే డీకేఎస్, రాహుల్ గాంధీపై సీఎం సిద్ధు ‘కులగ ణన’ అస్త్రం ప్రయోగించినట్లు, ఆ నివేదికను బుధవారమే ఆమోదించినట్లు సమాచారం.  

 కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోయాయి. కొంతకాలంగా ఎ న్నో నాటకీయ పరిణామాలు చేసుకుంటూ.. ఊగిసలాడుతున్న నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. సీఎం పదవికి సిద్ధరా మయ్య రాజీనామా చేయడంతో మూడేళ్ల ఆయన ప్రభుత్వానికి తెరపడింది. అయితే గురువారం ఉదయం బెంగళూరులోని ము ఖ్యమంత్రి అధికారిక నివాసంలో మంత్రులతో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పా హార విందు కాస్తా ఆయన వీడ్కోలు సమావేశంగా మారిపోయింది. ఈ సందర్భంగా సిద్ధరామయ్య తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో కాబోయే సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, రాష్ట్ర పగ్గాలను డీకే శివకుమార్‌కు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ తనను కోరినట్లు సిద్ధరామయ్య భావోద్వేగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్.. సిద్ధరామయ్యను హత్తుకుని, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీ స్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి డీకేఎస్ తో కలిసి సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్లా రు. అయితే, ఆ సమయంలో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు.  గవర్నర్ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని కార్యదర్శి వెల్లడించారు. 

హైకమాండ్ ఆదేశాలే శిరోధార్యం

లోక్‌భన్ నుంచి బయటికి వచ్చిన అనంతరం మంత్రులు డీకే శివకుమార్, పరమే శ్వరతో కలిసి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం సూచనలతో సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు.  నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పా రు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణమెజార్టీ ఉందని, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్వహణలో ‘నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.

సోని యా, రాహుల్, ఖర్గేకు కృతజ్ఞతలు. రాజ్యాంగమే మా ధర్మం. ప్రజలే మాకు దేవుళ్లు’ అని  తెలిపారు. రిటైర్మెంట్ తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని హైకమాండ్ అడిగిందని, రాజ్యసభ సీటు ఆఫర్‌చేసిందని, కానీ, తాను  తిరస్కరించానని వెల్లడించారు. సిద్ధరామయ్య స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడమే మిగిలింది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశం లో సీఎల్పీ నేతగా డీకేను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార కార్యక్రమంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

డీకేఎస్, రాహుల్‌పై ‘కులగణన’! అస్త్రం

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి కొద్ది క్షణాల ముందు, 2025 నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న కుల గణన నివేదికను సిద్ధరామయ్య ఆమోదించినట్లు సమాచారం. బుధవారమే వివాదాస్పదమైన వెనుకబడిన తరగతుల కమిషన్ సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే (కుల గణన) నివేదికను లాంఛనంగా ఆమోదించినట్లు మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కే మధుసూదన్ నాయక్ సదరు నివేదికను సమర్పించినట్లు తెలుస్తుంది.

దీనితో ఆయన తర్వాత కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పెనుప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్లు తెలిసింది. కర్ణాటకలో మొదటి కుల సర్వే నివేదిక, సిద్ధరామయ్య గత ముఖ్యమంత్రి పదవీకాలం అయిన 2017 నుంచే సిద్ధంగా ఉంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, సిద్ధరామయ్య మరో కుల సర్వేకు ఆదేశించగా, దాని నివేదిక 2025లో సిద్ధమైంది. పదవి నుంచి వైదొలగడానికి కొద్ది క్షణాల ముందు సిద్ధరామయ్య సర్వే నివేదికను ఆమోదించడాన్ని ఆయన చివరి వ్యూహాత్మక అస్త్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

ఇక డీకేనే కర్ణాటక కొత్త సీఎం 

కర్ణాటక సీఎంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో భారీ మంత్రివర్గ పునర్వ్య వస్థీకరణ కూడా జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలోని సుమారు 15 నుంచి 20 మంది మంత్రులు కొత్త ముఖాలకు చోటు దక్కొచ్చని ఓ ఎమ్మెల్య తెలిపారు. అదే సమయంలో, కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) సమావేశంలో ఓటింగ్ జరిగే ప్రసక్తే లేదని, డీకే శివకుమార్ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని ఆయన స్పష్టం చేశారు. శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అని బెంగళూరులో విలేకరులు ప్రశ్నించినప్పుడు రామ్‌దుర్గ్ ఎమ్మెల్యే బదులిచ్చారు. 100 శాతం డీకే శివకుమారే సీఎం అవుతారని ఆయన తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో సుమారు 15- నుంచి 20 మందిని మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా..

తన రాజకీయ ప్రస్థానాన్ని, పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరా మయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను పొరపాటున రాజకీ యాల్లోకి వచ్చా. మా కుటుంబంలో అంతకుముందు ఎవరూ రాజకీయా ల్లో లేరు. 2006లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి హైకమాండ్ నన్ను ఆదరించింది. సీఎం అవుతానని కల లో కూడా ఊహించలేదు. అలాంటిది సీఎంగా, ప్రతిపక్ష నేతగా రెండుసార్లు సేవలందించా. నాపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయి. కానీ, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్త కం. పదవికోసం, డబ్బు కోసం ఏనా డూ పాకులాడలేదు’ అని అన్నారు.