16 April, 2026 | 11:35 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

హుస్నాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టిండ్రు!

29-11-2025 09:49 PM

* ఈ ప్రాంతాన్ని నాలుగు జిల్లాల కేంద్రంగా డెవలప్ చేస్తున్నం

* మంత్రి పొన్నం ప్రభాకర్

* సీఎం సభ ఏర్పాట్లు, శంకుస్థాపన పనుల ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

హుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో సీఎం పర్యటన సందర్భంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన పనులను మంత్రి శనివారం రాత్రి పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ పర్యటన ఏర్పాట్లలో భాగంగా, మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నాయకులతో కలిసి అక్కన్న పేట రోడ్డు వద్ద ఉన్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతాన్ని నాలుగు జిల్లాల కేంద్రంగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యా, వైద్యం, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాల కల్పన, ఇరిగేషన్ లాంటి కీలక రంగాల్లో హుస్నాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. సభకు హాజరయ్యే ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సభ ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి

ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ముఖ్యమంత్రి  హుస్నాబాద్‌ సభలో మాట్లాడతారని మంత్రి ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఆకాంక్షలు, సమస్యలు నెరవేర్చే విధంగా ఈ పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు  వస్తున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సభకు వచ్చి విజయవంతం చేయాలని  విజ్ఞప్తి చేశారు.