28 June, 2026 | 2:35 AM

నేడు నల్లగొండకు సీఎం రాక

28-06-2026 01:25 AM
  1. రూ.13,006  హ్యమ్ రోడ్లకు శంకుస్థాపన
  2. జిల్లాలో రూ.1100 కోట్లతో విస్తరణ

నల్లగొండ, జూన్ 27 (విజయక్రాంతి) : నల్గొండ జిల్లాకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నడంతో జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో నూతనంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ 13,006 కోట్లతో 441 రహదారులలో 6092 కిలోమీటర్ల మేర విస్తరించి పనులకు కనగల్ మండల కేంద్రంలో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పైలాన్ కూడా ఏర్పాటు చేశారు.

హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (హ్యామ్ ) పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం పుట్టింది. ఇందులో నల్గొండ జిల్లాలో 1100 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 250 కోట్లతో మెడికల్ కళాశాల నుంచి మేళ్ల దుప్పలపల్లి వరకు, ధర్వేశిపురం నుండి డిండి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు విస్తరించి ఉన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో 40% ప్రభుత్వం వాటా అందిస్తే మిగిలిన 60% వాటాను గుతేదార సంస్థ సమకూర్చనుంది.