10 August, 2026 | 5:17 PM

ఘనంగా సీఎంఆర్ వర్ధంతి

02-09-2025 06:36 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఆరవ వర్ధంతిని మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతని తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక, దొమ్మాట నియోజకవర్గాలలో చేరుకు ముత్యంరెడ్డి విజయం సాధించి మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, చేగుంట మండల కేంద్రానికి జూనియర్ కళాశాల, వివిధ గ్రామాలలో, డ్వాక్రా మహిళా భవనాలు, మంజూరు చేసి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్యం రెడ్డికే దక్కుతుందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన  అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమం ప్రారంభించారు,ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.