యూరియా కోసం రైతుల ఇక్కట్లు
02-09-2025 06:33 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని రైతులకు సమయానికి యూరియా అందకపోవడంతో రైతులు మంగళవారం ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజుల నుంచి స్థానిక జెండా వెంకటాపూర్ సహకార సంఘ భవనం వద్ద క్యూ లైన్ పద్ధతిలో యూరియా తీసుకుంటున్నామని తెలిపారు. యూరియా కోసం వెళితే ఎప్పుడు వస్తాయో ఏమో అని పట్టింపు లేని సమాధానాలు అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను అర్ధం చేసుకుని సహకార సంఘం అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






