10 August, 2026 | 4:07 PM

పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

02-09-2025 06:37 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం రాజు డిమాండ్ చేశారు.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో జిల్లాలోని అనేక గ్రామాలలో పెద్ద మొత్తంలో పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరిగిందని, ఈ మేరకు సోమవారం యెల్లారెడ్డి నియోజకవర్గంలోని సదశివానగర్ మండలంలో ధర్మారావుపేట గ్రామంలో పర్యటించి పంట నష్టంను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి, రైతులకు వంట నష్టంను ఎకరాకు 50 వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని ఏద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకమును ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.  సందర్భంగా కామారెడ్డి జిల్లా ఈ జిల్లాలో రైతులకు మరియు కౌలు రైతుల వద్దకు వ్యవసాయ అధికారులను పంపించి జిల్లాలో నష్టపోయిన పంట నష్టాన్ని రైతు వారిగా అంచనా వేసి ఈ ప్రభుత్వానికి నివేదిక అందించాలని అలాగే నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వము నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.