11 March, 2026 | 5:38 AM

స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికులపై సీఎం వ్యాఖ్యలు అర్థరహితం

11-03-2026 01:10 AM

ఆటోనగర్ డంపింగ్  యార్డు వద్ద స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల నిరసన

ఎల్బీనగర్ మార్చి 11 :  హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రతకు స్వచ్ఛ ఆటో కార్మికులు చేస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించకపోగా, ఆటో కార్మికులపై  అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ టిప్పర్, ఆటో డ్రైవర్ జేఏసీ చైర్మన్ ఆలకుంట రాము ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సా యంత్రం ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌లో సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డును రాంకీ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలన్నారు. తరతరాలుగా జీవనాధారంగా ఇంటింటికీ చెత్తను సేకరిస్తూ వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తరుణంలో గత ప్రభుత్వంలో స్వచ్ఛ ఆటో లను కార్మికులకు అందజేసిందన్నారు.

దాదాపు పది సంవత్సరాలకు పైగా స్వచ్ఛ ఆటో లతో ఇంటింటికి చెత్తను సేకరిస్తున్న కార్మికులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తమకు తీవ్ర ఆవేదనను గురిచేసాయని, ఐదువేల ఆటోలను ఎక్కడ పంపిణీ చేశారో, ప్రభుత్వం వెంటనే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మ న్ పి.కృష్ణ, కార్మికులు బాలస్వామి, సంతోష్, భాషా, సంతోష్, రాజేశ్, రామకృష్ణ, నర్సిం హ, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.