13 April, 2026 | 1:29 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

కోస్ట్‌గార్డ్ డీజీ రాకేశ్ మృతి

19-08-2024 12:59 AM

చెన్నై, ఆగస్టు 18: ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఛాతీలో నొప్పి రావటంతో ఆదివారం ఉదయం ఆయన చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ దవా ఖానలో చేరారు. తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన మరణిం చినట్టు వైద్యులు ప్రకటించారు. రాకేశ్‌పాల్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కోస్ట్‌గార్డ్‌లో 1989లో చేరారు. గత ఏడాది జూలైలో డీజీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సంతాపం ప్రకటించారు.