ఈ శునకం ఆస్తులు రూ.3,356 కోట్లు
ప్రపంచంలోనే ధనిక కుక్కగా రికార్డులకెక్కిన గుంథర్
వారసులు లేకపోవడంతో కుక్క పేరుమీద ఆస్తులు రాసిన యజమాని
న్యూ ఢిల్లీ, ఆగస్టు 17: దాదాపు 400 మిలియన్ డాలర్లు(రూ.3,356 కోట్లు) నికర విలువ కలిగిన గుంథర్ అనే జర్మన్ షెపర్డ్ ప్రపంచంలోనే అత్యంత ధనిక కుక్కగా రికార్డులకెక్కింది. జర్మనీకి చెందిన కౌంటెస్ కొర్లెటా లైబెన్‌స్టెయిన్ అనే బిలియనీర్ కుమారుడు గుంథర్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కౌంటెస్ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి కుమారుడి పేరు పెట్టి గుంథర్ పేరు మీద తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చాడు.
తదనంతరం గుంథర్(కుక్క) వారసులకు ఆ ఆస్థిని బదలాయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం గుంథర్ వారసుడైన గుంథర్ నికర విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో రూ.3,356 కోట్లు అన్నమాట. గుంథర్ సంరక్షణ బాధ్యతలు తీసుకున్న స్వచ్ఛంద సంస్థ ఆయా ఆస్తులను పెట్టుబడులు పెట్టి వచ్చే లాభాన్ని, కొత్తగా కొన్న ఆస్తులను గుంథర్ పేరుమీద చేయడం వంటి పరంపర కొనసాగుతోంది.
గుంథర్ ఆస్తులను ఓసారి పరిశీలిస్తే..
- మయామీలో 7.5 మిలియిన్ డాలర్ల విలువ చేసే ఓ భవనం ఉంది.
- గుంథర్ కొన్ని క్రీడా జట్లను కూడా కొనుగోలు చేశాడు
- మాగ్నిఫిసెంట్ అనే సంగీత బృందం కూడా ఉంది.
- గుంథర్‌కు సేవలు అందించేందుకు నిత్యం 27 మంది ఉద్యోగులు పనిచేస్తన్నారు.




