ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
పది మంది మృతి.. 27 మందికి గాయాలు
లక్నో, ఆగస్టు 18: ఉత్తప్రదేశ్‌లో ని బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రో డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రై వేటు బస్సు, టెంపో వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పది మంది మృతిచెందగా, 27 మంది గా యాలపాలయ్యారు. టెంపో వ్యాన్ లో ఆదివారం 25 మంది ప్రయాణికులు షికార్‌పూర్ నుంచి బులంద్ షహర్‌కు ప్రయాణిస్తుండగా సేలంపూర్ వద్ద ఎదురు వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఘటనలో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా, తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే పది మంది మృతిచెందారు. 27 మందికి గాయాలయ్యా యి. స్థానికులు, సేలంపూర్ పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో భాగస్వాములవుతు న్నారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అహిర్ నాగ్లా గ్రామానికి చెం దిన వారని తెలిసింది. ప్రైవేటు బ స్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ వర్ టేక్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు టెంపో వాహనాన్ని ఢీకొ ట్టినట్లు తెలుస్తోంది.




