కూలిన టన్నెల్
- 12 మంది మృతి
- సిక్కింలో ఘటన
- శిథిలాల కిందే 17మంది కార్మికులు
గ్యాంగ్‌టక్, జూలై 21: సిక్కింలో కొండచరియలు విరిగిపడిన ఘోర ప్రమాదంలో 12 మంది కార్మికులు మృతి చెందగా, 17మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టన్నెల్ ప్రవేశ మార్గం మూసుకుపోవడం, మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
నామ్చి జిల్లాలో సమర్దుంగ్ ఎన్‌హెచ్‌పీసీ తీస్తాస్టేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాలను తొలగించేందుకు అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తుండగా, ప్రమాదకర గ్యాస్ వెలువడుతోందని సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు ప్రకటించారు. ఈ విషాదంపై సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం, సానుభూతి తెలియ జేశారు. కేంద్రం తరఫున మృతిచెందిన వారికి రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని, గాయపడ్డవారికి రూ. 50వేల పరిహారం ప్రకటిం చారు. చిక్కుకుపోయిన కార్మికులకు పటేల్ ఇంజనీరింగ్, ఎన్‌హెచ్‌పీసీకి చెందిన 27మందిగా అధికారులు గుర్తించారు.






