10 March, 2026 | 11:44 AM

వివిధ గ్రామాల్లో గ్రామ సంఘాల పాత బకాయిలు వసూలు

09-03-2026 05:30 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలో ఆరవ రోజు ఐకెపి ద్వారా క్లస్టర్ల వారిగా వివిధ గ్రామాల్లో రికవరీ టీం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మహిళా సంఘాల ద్వారా తీసుకున్నటువంటి లోన్లను, పాత బకాయిలను వసూలు చేసినట్లు మండల ఇంచార్జ్ ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. సోమవారం రికవరీ డ్రైవర్ ద్వారా తాండూర్ గ్రామంలో 30,000/-మాల్తుమ్మెద 74,723/-వాడి 30,000/- గోలిలింగాల 40,000/-చొప్పున మొండి బకాయిలు ఒక్క లక్ష 74 వేల,723 రూపాయలు వసూలు చేసినట్లు మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు లీకేజ్ డిపిఎం రాజయ్య, ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.