calender_icon.png 1 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చైతన్యంపై సంతకాల సేకరణ

29-04-2024 01:05:23 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : ఓటర్లను చైతన్యవంతం చేయడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి మాధవిదేవి పాల్గొని సంతకం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఓటిం గ్ శాతం పెంచాలనే లక్ష్యంతో బూత్‌లెవల్ అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆర్పీలు, పీవోలు, పిడీలు అందరూ వారి వారి పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తూ, వినూత్నంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోలింగ్ తేదీని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ‘పోలింగ్ తేదీతో పాటు ఓటరుగా గర్వపడుతున్నాను’ అనే నినాదంతో ఇంటింటికీ స్టిక్కర్లను అంటిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 45లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని అధికా రులు తెలిపారు.