గ్రామాల్లో కనిపించని ఎన్నికల సందడి

29-04-2024 01:06:27 AM

సోషల్ మీడియాపైనే అభ్యర్థుల దృష్టి

సామాజిక వర్గాల సమ్మేళనాలకే మొగ్గు

భువనగిరిలో క్రాస్ ఓటింగ్‌పై భయాలు

యాదాద్రిభువనగిరి, ఏప్రిల్28 (విజయక్రాంతి): నామినేషన్ల గడువు తీరిపోవడంతో భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తలమునకలైయ్యా రు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. 10 మంత్రి పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం 51 మంది బరిలో ఉన్నారు. ఇక ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. నియెజకవర్గాలవారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత మండల స్థాయిలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల సందడి ఎక్కడా కనిపించడం లేదు.

సామాజిక సమీకరణాల్లో అభ్యర్థులు

అధికార, విపక్ష పార్టీ నాయకులు ఎన్నికల్లో తమకు ఏయే సామాజిక ఆంశాలు అనుకూలిస్తాయో లెక్కలు వేస్తూ ఆయా వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. బీసీ కార్డుతో బరిలోకి దిగిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులు, ఆరు గ్యారెంటీ పథకాలతో బరిలోనికి దిగిన కాంగ్రెస్ పార్టీ వివిధ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవాల ని వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ కుల సం ఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ హ ల్స్, గ్రామ దేవతల గుడి నిర్మాణాలకు హామీలు ఇస్తున్నారు. ఆయా వర్గాల నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలలో సహక రిస్తామని భరోసా ఇస్తున్నారు. 

అభ్యర్థులో భయం...

భువనగిరిలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా.. అభ్యర్థుల్లో మాత్రం క్రాస్ ఓటింగ్ భయం ఉంది. కాంగ్రెస్‌లో పైకి అంతబాగానే కనిపిస్తున్నప్పటికీ పార్టీలో నూతనంగా చేరిన వారు, సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కుదరడం కష్టమే అంటున్నారు కార్యకర్తలు. ఇకా బీజేపీలో పార్టీ సీనియర్లను కాదని బీఆ ర్‌ఎస్ నుంచి వచ్చిన బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్ ఇచ్చారని, ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పీవీ శ్యాం సుందర్‌రావు, భువన గిరి ఎమ్యేల్యేగా పోటీ చేసిన గూడూరు నారాయణరెడ్డి వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ప్రచారంలో మొక్కుబడిగా పాల్గొంటున్నారని, అభ్యర్థి అందరిని కలుపుకుపోవడం లేదని విమర్శలున్నాయి. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ నియోజకవర్గాల సమావేశాలకే పరిమితమయ్యాడని, క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎ స్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచుకోవడంతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నా యి. ప్రధాన పార్టీలోని అంతర్గత కలహాలు తమకు ఏ విధంగా నష్టం చేస్తా యోనని ఆందోళన చేందుతున్నారు.