18-08-2025 06:46:13 PM
అదనపు కలెక్టర్ బిఎస్ లత
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): వీరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న అని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మొఘల్ సామ్రాజ్యాన్ని సర్వాయి పాపన్న కూలదోసి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేసి బహుజనులకు రాజ్యాధికారం కావాలని రాజకీయ చైతన్యాన్ని పరిచయం చేశాడన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని కోరారు. వీరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారన్నారు.
బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న. నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.