calender_icon.png 18 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి అన్ని హంగులతో సిద్ధం చేయాలి

18-08-2025 06:35:13 PM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల,(విజయక్రాంతి): జిల్లాలో రెండు పడక గదుల (డబుల్ బెడ్ రూమ్) ఇళ్ళను అర్హులైన లబ్దిదారులకు కేటాయించేందుకు అన్ని హంగులతో మిగిలి ఉన్న పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్ మాసం మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను ప్రారంభోత్సవం చేసే విధంగా మిగిలి ఉన్న అన్ని పనులను వారం రోజులలో పూర్తి చేయాలన్నారు.

పట్టణంలోని దాదర్ పల్లి వద్ద నిర్మించిన 715 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు మిగిలి ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని, విద్యుత్తు, కుళాయిలకు నీటి కనెక్షన్లు, పెయింటింగ్ పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.  నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ పునఃపరిశీలించుకుని లబ్ధిదారుల మంజూరు ఉత్తర్వులను సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ సముదాయాల వద్ద రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధం పనులను చేపట్టి సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవానికి అన్ని హంగులతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.