calender_icon.png 18 August, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక వృత్తి విద్యా కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

18-08-2025 06:18:26 PM

టాటా కన్సల్టెన్సీ ద్వారా ఖచ్చితమైన ప్లేస్మెంట్

 విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

 అదనపు కలెక్టర్ రెవెన్యూ  ఖీమ్య నాయక్

వనపర్తి టౌన్: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో  ప్రస్తుతం బాగా డైమండ్ ఉన్న వృత్తి విద్యా  కోర్సుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు చేసుకోవాలని  అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ సూచించారు. సోమవారం ప్రజావాణి హాల్లో ఎ.టి.సి గోడ పత్రికను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ రమేశ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నెలకొల్పి వాటిలో ప్రస్తుతం బాగా డిమాండు ఉన్న కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. వనపర్తి జిల్లాలోని ఐ.టి.ఐ కళాశాలలో  ఈ ఆధునిక వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఆగస్టు 28 వరకు అవకాశం కలదు. 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అన్ని ధ్రువపత్రాలతో  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట ప్రాంతంలో ఐ.టి.ఐ కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు.  ఆన్లైన్ చేయకున్నా నేరుగా కళాశాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకొని సీటు పొందవచ్చు అన్నారు. వనపర్తి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవ్మవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐ.టి. ఐ కళాశాల ప్రిన్సిపల్ కె. రమేష్ బాబు తో పాటు జిల్లా  లేబర్ ఆఫీసర్ బి. వేణుగోపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జానీ పాషా, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.