18-08-2025 06:29:56 PM
యూరియా లభ్యత పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో యూరియాకుగాని ఇతర ఎరువులకుగాని ఎలాంటి లోటు లేదని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి ఆయా జిల్లాల్లో పంటల సాగు, యూరియా లభ్యతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఈసారి ముందస్తు వర్షాలు పడటం ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు అన్ని రకాల పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా యూరియా విషయానికొస్తే భారతదేశానికి ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా సకాలంలో రావడంలేదని అయినప్పటికిని తెలంగాణ రాష్ట్రంలో నిలువ ఉన్నటువంటి యూరియాను ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో జిల్లాకు మరో 1500 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుంది కాబట్టి జిల్లాలో ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు.